తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
స్థానిక డి ఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ప్రభుత్వ ఆదేశానుసారము వారం రోజులు తెలుగు భాష వారోత్సవాలు జరుపబడ్డాయి. ఉపన్యాస, వ్యాసరచన, పద్యపఠన, సామెతలు చెప్పడం,మొదలగు పోటీలు నిర్వహింపబడ్డాయి. వర్ధమాన కవులకు సన్మానాలు జరుపబడ్డాయి.నేడు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి కళ్యాణి గారి అధ్యక్షతన తెలుగు భాషా సభ నిర్వహింపబడింది. తెలుగు శాఖధిపతి శ్రీమతి పి యామినీ అమ్మాజీ ఆహ్వానం పలుకుతూ, తెలుగుని వ్యవహార భాషగా తీర్చిదిద్దిన మహనీయుడు స్వర్గీయ గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారిని స్మరిస్తూ ప్రతి తెలుగు వారు నేడు ఉత్సవం జరుపుకోవాలని పిలుపునిచ్చారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి కళ్యాణి గారు తెలుగు వారు దేశ విదేశాలకు ఎదిగినా తెలుగు భాష ప్రాముఖ్యత మరువద్దని సలహా ఇచ్చారు. Iqac కోఆర్డినేటర్ శ్రీమతి కుసుమకుమారి గారు, ఇంచార్జ్ ప్రిన్సిపల్ అనంతలక్ష్మి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థినులు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శించారు. తెలుగంటే అంటూ దేశ విదేశాలకు ఎదిగిన తెలుగు వారి గొప్పతనాన్ని విశ్లేషిస్తూ ఆధునిక నృత్యాన్ని కూడా ప్రదర్శించారు. అనంతరము వివిధ ప్రజ్ఞాపాఠ వ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానం చేయబడింది. శ్రీమతి ఎం సుధారాణి గారు వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డి గారు డాక్టర్ ధనుంజయ గారు విద్యార్థులు అందరూ పాల్గొన్నారు పాల్గొన్నారు.
You may also like
Cybersmart Certification Program
Reusable Sanitary Pads for sustainable menstrual hygiene
In Damacharla Sakkubayamma government college for women, the State bank of India, RBO, Ongole in Collaboration with NSS, Medical Inspection Committee and the department of Computer Science Organized an awareness program on “Reusable Sanitary Pads for Sustainable Menstrual Hygiene” and …
Workshop on “Animal Science Model Crafting”
Department of Zoology in collaboration with IQAC conducted a workshop on “Animal Science Model Crafting” from 15th September to 16th September 2023.The resource person Sri E. RamaRaju, lecturer in Zoology, YA Govt Degree College, Chirala made the students prepare various …